ఓటర్ల జాబితా సవరణపై ఇంటింటికీ అవగాహన - టీడీపీ నాయకుడి సూచన

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలాపుట్ గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కె. జగత్రాయ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని, పేరు చేర్పు, తొలగింపు, మార్పులు వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్