వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి.. సురేష్‌ కుమార్‌కు జగన్ అప్పగింత

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తడగిరి గ్రామానికి చెందిన డాక్టర్ తెడబరికి సురేష్‌కుమార్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం నేతగా, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా సేవలందిస్తున్న సురేష్‌కుమార్‌కు పార్టీ పట్ల అంకితభావానికి గుర్తింపుగా ఈ బాధ్యత అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2029లో వైఎస్ఆర్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్