నక్కలపుట్టులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం

పాడేరు మండలం నక్కలపుట్టులో గురువారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు గాలికి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంటలు ఆరిపోయాయి. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్