కొయ్యూరు: మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కొమ్మికకి చెందిన గోరా. రాజేశ్వరి(25)అనే వివాహిత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త శివ మద్యం తాగి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగిందని ఎస్ఐ పీ. కిషోర్ వర్మ గురువారం తెలిపారు. మృతురాలి తండ్రి ఈదల. సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్