అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో వద్ద బుధవారం ఉదయం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదు.