జికె వీధి మండలంలోని పాతవీధి జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా, సీలేరు నుంచి చింతపల్లి వైపు వస్తున్న కారు, బైక్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాటిని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులో 170 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చిత్తూరుకు చెందిన దామోదరం, రాజానగరానికి చెందిన సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, జికెవీధికి చెందిన మార్క్ సిద్ధూ అనే నలుగురిని అరెస్టు చేశారు. వారిని జికె వీధి సిఐ, చింతపల్లి కోర్టుకు రిమాండ్కు హాజరుపరిచారు. స్వాధీనం చేసుకున్న కారు, బైక్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.