పాడేరులో అక్టోబర్ 6న మెగా రక్తదాన శిబిరం నిర్వహణ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో అక్టోబర్ 6న ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఏజెన్సీలో రక్తం కొరతతో బాధపడుతున్న రోగులకు సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ రక్త నిల్వ కేంద్రంలో జరిగే ఈ శిబిరంలో యువత, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, దాతలు పాల్గొని రక్తదానం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. జిల్లా అధికారులు, ఐఏఎస్ అధికారులను కూడా ఆహ్వానించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమనే స్ఫూర్తితో శిబిరాన్ని విజయవంతం చేయాలని శనివారం  పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕