పాడేరు: రహదారి పూర్తి చేయాలని డోలి మోస్తూ నిరసన

తమ గ్రామానికి తారు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసి, మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని కోరుతూ పాడేరులో గిరిజనులు శుక్రవారం వినూత్నంగా డోలి మూసుకుంటూ ర్యాలీ చేశారు. హుకుంపేట మండలం చీకుమద్దుల నుంచి డల్లాపల్లి వరకు రహదారి పనులు పూర్తి చేయాలని వారి డిమాండ్. పాడేరు ఐటీడీఏ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. రహదారి పనులు వెంటనే పూర్తి చేసి తమ డోలి కష్టాలు తీర్చాలని గిరిజనులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్