లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి పట్టుబాటు

పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు, పంచాయతీ శానిటేషన్ బిల్లును మార్పు చేయడానికి రూ. 30 వేలు లంచం కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, బుధవారం అధికారులు వలపన్ని లక్ష్మణరావును ఆయన నివాసం వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు హర్షిత, రమణమూర్తుల బృందం ఈ దాడులు నిర్వహించింది. లంచం డిమాండ్ చేసే వారిపై సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్