ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

జి. మాడుగుల మండలంలోని వెంజరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాంగి సిద్ధూ (21) అనే యువకుడు మృతి చెందాడు. పెదబయలు మండలం లింగేరిపుట్టు గ్రామానికి చెందిన సిద్ధూ, 516-ఈ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గెడ్డ నుంచి నీటిని తీసుకురావడానికి ట్యాంకర్ ట్రాక్టర్‌తో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిద్ధూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్