పాడేరు–జి.మాడుగుల రహదారిపై వాహనాల రాకపోకల మళ్లింపు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు–జి. మాడుగుల ప్రధాన రహదారిపై మత్స్యపురం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డుపై నీటి ప్రవాహం పెరగడంతో ప్రజల భద్రత దృష్ట్యా ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ, హైవే సిబ్బంది నీటి ప్రవాహాన్ని మళ్లించి, రోడ్డులో కొంత భాగాన్ని తవ్వారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ప్రజలు తదుపరి సూచనలు వచ్చేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని SI సాయి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕