అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో సముద్ర తీర ప్రాంతంలో అలల ఉదృతికి బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన మత్స్యకారుడు చోడిపల్లి సింహాద్రి మృతదేహాన్ని బంగారమ్మపాలెం ఏటి మొగ వద్ద సోమవారం గుర్తించారు. దీంతో స్థానికులు, మత్స్యకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.