జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో దొంగగా చిత్రీకరించి, తప్పుడు ఆరోపణలు చేసిన బొజ్జా ఐశ్వర్యపై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజల నుంచి 80 కోట్ల రూపాయలు కాజేశారని బొజ్జా ఐశ్వర్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని శివదత్ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాలని ఆయన కోరారు.