అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండల కేంద్రం సమీపంలో వరాహ నది వద్ద గార్మి షరీఫ్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు క్రికెట్ టోర్నమెంట్ శనివారం నిర్వహించారు. ఈ నెల 3, 4 తేదీలలో జరిగిన ఈ పోటీలలో బాయ్ కింగ్స్, మామూలైన్స్, పుప్పా టైగర్స్, బాయ్ జాన్ వారియర్స్ జట్లు పాల్గొన్నాయి. విజేతలకు 4న ఆదివారం గార్మి షరీఫ్ పండుగ రోజున బహుమతులు అందజేస్తామని ముస్లిం కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటవురట్ల, ఎస్ రాయవరం, నక్కపల్లి మండలాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.