అనకాపల్లి జిల్లా, కోటఊరట్ల మండలం బోడపాలెం పంచాయతీ కొత్తూరు గ్రామంలో నూతన శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక కృషితో సుమారు రూ. 40 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా, శుక్రవారం కొత్తూరు గ్రామంలో నూతన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెట్ల లింగన్న నాయుడు, బ్యాంక్ చైర్మన్ జనార్దన్, బ్యాంక్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ నానిబాబు, మాజీ సర్పంచ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.