అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛభారత్ అవార్డు లభించింది. శుక్రవారం అనకాపల్లిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ చేతుల మీదుగా హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, రోగుల ఆరోగ్య భద్రతకు తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.