నక్కపల్లి: కోలుకుంటున్న కార్మికులు

నక్కపల్లి మండలంలో హెట్రోలో మంగళవారం రాత్రి జరిగిన సంఘటనలో అస్వస్థతకు గురైన కార్మికులందరూ కోలుకుంటున్నట్లు మండల టిడిపి అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై అటువంటి సంఘటనలు జరిగితే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశ్రమ యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్