పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజా సంబంధాలు, శాంతిభద్రతలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, నేరాల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామం సున్నిత ప్రాంతంగా గుర్తించబడినందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఇన్స్పెక్టర్ ఎం. వినోద్ బాబు, ఎస్ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.