రాజయ్యపేట: 'పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అందించాలి'

రాజయ్యపేట గ్రామంలో 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు సెక్రటరీ సత్యం జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు, రాజ్యయ్యపేట జనసేన నాయకులు పిక్కీ స్వామి శుక్రవారం డిమాండ్ చేశారు. సుమారు 6-8 లక్షలు డ్రా చేసినా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పై అధికారులు చొరవ తీసుకుని విచారణ జరిపి జీతాలు అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్