ఎస్ రాయవరం: వైభవంగా ముక్కోటి ఏకాదశి పూజలు

ఎస్. రాయవరంలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం వేకువజామున ఆలయంలో తిరుప్పావై సేవ, పాసుర విన్నపం కార్యక్రమాలను నిర్వహించి స్వామికి హారతి ఇచ్చారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త బొలిశెట్టి గోవిందు తెలిపారు.

సంబంధిత పోస్ట్