రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలి

పాయకరావుపేటలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపిడిఓ అడపా లవరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ ఖరిఫ్ సీజన్‌లో వరి విత్తనాలు, ఎరువులు రైతులకు సరిపడా అందలేదని, 20% విత్తనాలు కూడా లభించలేదని ఆయన ఆరోపించారు. అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందక మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో వీటిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్