పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామంలో శుక్రవారం స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు కట్టా శ్రీను, జనసేన గ్రామ అధ్యక్షుడు తుమ్మల గణేష్, సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ సొమ్మును అందించారు. వారు లబ్ధిదారుల యోగక్షేమాలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.