పాయకరావుపేట పట్టణంలోని 80, 81, 82, 83, 84 బూత్ లలో ఓటర్ల తనిఖీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ యాళ్ళ వరహాలబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా జరిగింది. కూటమి పార్టీల నాయకులు బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆచంట దొర, జూరెడ్డి ప్రసాద్, లెక్కల గోవిందరావు, వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.