దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ పరిధిలోని గండివానిపాలెం గ్రామంలో స్థల వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో మడక కృష్ణ అనే వ్యక్తి ప్రత్యర్థిపై కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మడక కృష్ణను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్