తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. పరవాడ ఎన్. టీ. పీ. సీ సింహాద్రిలో శుక్రవారం నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాలికల హక్కులను కాపాడాలన్నారు. వారి ఆరోగ్యం పోషణ తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.