పెందుర్తి: దారి కాచి నగదు దోపిడీ

పెందుర్తి మండలం నాయుడుతోట సాయిదుర్గానగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు దారికాచి రూ. 5, 000 నగదు లాక్కున్నట్లు సాయికిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసాడని క్రైమ్ ఎస్ఐ సూరిబాబు తెలిపారు. వడ్లపూడికి చెందిన సాయి కిరణ్ నాయుడు తోటలో గల మరో ఇంటిని చూడడానికి వెళ్ళాడు. సాయంత్రం స్నేహితులతో కలిసి బార్ కు వెళ్లి తిరిగి సాయిదుర్గానగర్ కు వెళుతుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్