పెందుర్తి మండలం సుజాతనగర్ ప్రాంతంలో గిరి ప్రసాద్ నగర్, ప్రశాంత్ నగర్, కార్మిక నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి బయోమెట్రిక్ తీసుకుని పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 1 ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.