విశాఖ: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

సబ్బవరం శివారు పెదనాయుడుపాలెంలో పూర్ణశేఖర్(22) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు ఆదివారం రాత్రి ఇంటిలో భోజనం చేసి బయటకు వెళ్లాడు. సోమవారం తల్లిదండ్రులు నారపాడు గోవింద, నాయుడమ్మ కల్లం వద్దకు వెళ్లి చూడగా పశువుల షెడ్డు వద్ద వేలాడుతు విగతజీవిగా కనిపించాడు. తల్లి నాయుడమ్మ ఫిర్యాదు మేరకు పరవాడ డి. ఎస్. పి విష్ణు స్వరూప్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్