నివాస ప్రాంతాల్లో 10 అడుగుల గిరినాగు కలకలం

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం వంచంగి పంచాయితీ కుంతీదేవి వీధిలో నివాస ప్రాంతాల మధ్య గురువారం మధ్యాహ్నం 10 అడుగుల పొడవు గల విషపూరితమైన గిరినాగు కలకలం రేపింది. దాన్ని చుసిన గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొనడంతో దానిని చంపినట్లు పీసా వైస్ చైర్మన్ కోసూరి చిన్నబ్బాయి తెలిపారు.

సంబంధిత పోస్ట్