చింతూరు మండలం తులసిపాక వద్ద 143 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం రాత్రి టైర్ పంక్చర్ అయి మధ్యలోనే ఆగిపోయింది. రాజమహేంద్రవరం నుండి భద్రాచలం వెళ్తున్న ఈ బస్సులో పండగ రద్దీ, సెలవుల కారణంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక లోడుతో వెళ్తున్న బస్సు ముందు టైర్ పంక్చర్ కావడంతో ప్రయాణికులు రాత్రివేళ చలిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులో టైర్ మార్చేందుకు పరికరాలు లేకపోవడంతో, అటుగా వెళ్తున్న వ్యాను సహాయంతో సమస్యను పరిష్కరించుకుని బస్సు తిరిగి భద్రాచలం బయల్దేరింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు రెండు సార్లు మూర్ఛతో కూడా బాధపడ్డాడు.