రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామదేవత పట్టాలమ్మ ఆలయంలో గురువారం 168 మంది ఆదివాసీ జంటలకు వైదిక విధానంలో, శాస్త్రోక్తంగా సామూహిక వివాహాలు జరిగాయి. చిన్న జీయర్ స్వామితో పాటు హాజరైన ఆధ్యాత్మిక స్వాములు వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.