అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి, జడ్డంగి రైతు సేవా కేంద్రాలకు బుధవారం 28 టన్నుల వరి విత్తనాలు చేరాయని ఏ. ఓ చక్రధర్ తెలిపారు. జడ్డంగికి 329 బస్తాల 1064 రకం, రాజవొమ్మంగికి 519 బస్తాల 1318 రకం ధాన్యం సిద్ధంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని విత్తనాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సహాయకులు సాయికిరణ్, శ్రీను పాల్గొన్నారు.