రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే గిరిజన గ్రామాల్లో జోరుగా సాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలంలో బుధవారం రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న గిరిజన రైతుల భూములను రీసర్వే చేస్తున్నారు. ప్రస్తుతం వేటుకూరులో ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాస్ పుస్తకాల ఆధారంగా కొలతలు వేసి గుర్తిస్తున్నారు. ఇది గిరిజనులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పనుల్లో విఆర్ఓ గోపాలకృష్ణ, సర్వేయర్లు, గిరిజనులు పాల్గొన్నారు.