అల్లూరి జిల్లా జీకే వీధి ఎంపీడీవో రమణబాబు మంగళవారం మాట్లాడుతూ, వివిధ కంపెనీల్లో ఖాళీగా ఉన్న 1000 పోస్టుల భర్తీకి ఈనెల 7వ తేదీన జీకే వీధిలో ఒక సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సామర్థ్యాలను బట్టి ఉద్యోగాల ఎంపిక జరుగుతుందని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.