రంపచోడవరం DSP అషరఫ్ అలీ రాజవొమ్మంగి వారపు సంత వద్ద ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లకు వచ్చే తెలియని లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని ఆయన సూచించారు. రూ.13వేలు ఖాతాలో పడ్డాయని, లింక్ క్లిక్ చేస్తే తీసుకోవచ్చని సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చిన మెసేజ్‌ను DSP ఉదాహరణగా చూపించారు.