గంగవరం మండలం ఏటిపల్లి వద్ద ఈనెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జడ్డంగి వాల్మీకి నగర్‌కు చెందిన బొంకు దామస్ కుటుంబాన్ని బుధవారం జడ్డంగి జడ్పీ ఉన్నత పాఠశాల 1997 పదో తరగతి పూర్వ విద్యార్థులు పరామర్శించారు. దామస్ భార్య బేబీకి రూ.16 వేల నగదు సాయం అందించి ధైర్యం చెప్పారు. మంచి మిత్రుడిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగిరెడ్డి పద్మ, కోటం మంగాదేవి, బర్లంకి సత్యవతి, బొంకు సలోమి, పళని త్రిమూర్తులు పాల్గొన్నారు.