అంగన్వాడీ కార్యకర్త అమ్మాజీ మృతి తీరని లోటు..ఎమ్మెల్యే

రాజవొమ్మంగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కోపూరి అమ్మాజీ మృతి తీరని లోటని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. అమ్మాజీ ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం కూటమి నాయకులతో కలిసి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ అమ్మిరాజు, యూనియన్ లీడర్లు కె. వెంకటలక్ష్మి, చిన్నికుమారి, ఎర్రయ్యమ్మ, మంగమ్మ , గడ్డమ్మ, రామరాజు టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు సూరిశెట్టి సురేష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕