మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆర్ధిక లావాదేవీల ఆడిట్

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మంగళవారం 59 గ్రామ సమాఖ్యల పరిధిలో ఏడాది పాటు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ జరిగింది. ఆడిటర్లు అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి. డా. డి. రత్నాకరరావు, డిపిఎంలు సన్యాసిరావు, ప్రసాద్, మండల సమైక్య ప్రతినిధి సాగిన దేవి, ఏ.పి.ఎం. మర్రి లక్ష్మి, సిసిలు రామకృష్ణ, సింహాచలం, సూర్యనారాయణ, లింగమ్మ, చిలకమ్మ, సిబ్బంది రాజశేఖర్, ఆడిటర్లు సాంబశివరావు, సీతారామ, సత్య ప్రకాష్, మరియు 59 గ్రామ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕