అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి ప్రధాన కూడలి వద్ద సోమవారం సీఐ సన్యాసినాయుడు, ఎస్.ఐ. వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రజలకు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెబితే నగదు వస్తుందని ఆశచూపి, ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేస్తున్నారని, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి వల్ల కలిగే నష్టాలపై కూడా అవగాహన కల్పించారు.