కుక్కకాటుపై రంపచోడవరంలో అవగాహన సదస్సు

రంపచోడవరం పట్టణంలో బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వికేటి మహాలక్ష్మి కుక్కకాటుకు గురైన వారు గాయాన్ని వెంటనే సబ్బుతో కడగాలని సూచించారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్, జంతుశాస్త్ర విభాగం సంయుక్తంగా కుక్కకాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించాయి. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, కుక్క కరిస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా కుక్కకాటు నివారణ చర్యలపై ప్రజలకు తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్