కాలువలు వద్ద అప్రమత్తంగా ఉండాలి.. ఎస్‌ఐ

భారీ వర్షాలతో జడ్డంగి పరిధిలోని మడేరు, పాలకాలువ, వనకరాయి, వాతంగి కాలువల్లో నీటి ప్రవాహం పెరిగిందని ఎస్‌ఐ చినబాబు గురువారం తెలిపారు. ప్రజలు కాలువల వద్దకు వెళ్లవద్దని, చిన్నారులను నీటి ప్రవాహ ప్రాంతాలకు దూరంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕