గేదెను ఢీకొన్న బైక్: శరభవరం యువకుడికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం తంటికొండ జాతీయ రహదారిపై ఆదివారం (జూన్ 28) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం నుండి శరభవరం గ్రామానికి బైక్‌పై వస్తున్న మొల్ల సన్నీబాబు, అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సన్నీబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించగా, స్టాఫ్ నర్స్ లక్ష్మి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్