రాజవొమ్మంగిలో బుధవారం తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.ఎన్.యం. రత్నకుమారి మాట్లాడుతూ, తల్లి పాలలో అమృతం ఉంటుందని, పాలు ఇచ్చే తల్లులకు రోగాలు దరిచేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వీరయ్యమ్మ, పలువురు అంగన్వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.