కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభం: 125 పనిదినాలు, రూ.312 వేతనం

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం, రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో (జూలై 2) గురువారం, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వి.బి.జి. రామ్ జి పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 125 రోజులు పని దినాలు, దినసరి వేతనం రూ. 312 గా పెంచారని, 318 రకాల పనులు చేసుకునే అవకాశం కల్పించారని టిడిపి సీనియర్ నాయకులు గణజాల తాతారావు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి వాశంశెట్టి గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్కా పండుబాబు, రాటా సోమరాజు, ఆశ్రమ స్కూల్ ఇన్ చార్జి హెచ్.ఎం. కోసూరి శ్రీదేవి, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్