సీఎం సహాయనిధి పేదల అభయహస్తం: ఎమ్మెల్యే శిరీష

అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. సోమవారం రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మండల పార్టీ అధ్యక్షులు పి. అనంత మోహన్, గురుకు శేషుకుమార్, గొల్ల చంటిబాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ, అనారోగ్యాల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారికి ఈ సహాయనిధి భరోసా ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూ. 8,81,287/-ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్