ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్ తీగలు

రంపచోడవరం మండలంలోని ఎస్టీ కాలనీలో కేబుల్ టీవీ ఛానల్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి. రాత్రిపూట కనిపించకపోవడంతో బైక్‌లపై వెళ్లేవారు పలుమార్లు కిందపడిపోతున్నారని స్థానికులు తెలిపారు. వర్షాల కారణంగా తీగలు తెగిపడే ప్రమాదం ఉందని, పిల్లలు ఆడుకునే చోట ఈ ప్రమాదం మరింత ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి అని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్