రాజవొమ్మంగి మండల ప్రత్యేకాధికారిగా డీఈఓ శ్రీరామూర్తి

రాజవొమ్మంగి మండల ప్రత్యేకాధికారిగా పోలవరం జిల్లా విద్యాధికారి శ్రీరామూర్తి ను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మండల పరిషత్ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో పరిపాలనా వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని నియమించారు. ఇకపై మండల పరిషత్‌కు సంబంధించిన అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను ప్రత్యేకాధికారి పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕