దేవీపట్నం: పులిని పట్టుకునేందుకు 19 రెస్క్యూ బృందాలు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి పులి దాడిలో 12 ఆవు దూడలు, ఒక గేదె దూడ చనిపోయాయి. మరో దూడను పులి అడవిలోకి లాక్కెళ్లింది. డీఎఫ్ రామచంద్రరావు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పులిని పట్టుకునేందుకు 19 రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు మృతి చెందిన పశువులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్