దేవీపట్నం: సారా బట్టీలపై దాడులు

దేవీపట్నం మండలం దేవారం గ్రామ సమీపంలోని సారా బట్టీలపై సోమవారం దాడులు చేశామని ఎస్సై షరీఫ్ తెలిపారు. సారా తయారీ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించామని చెప్పారు. అక్కడ సారాబట్టీలను తగలబెట్టామని తయారీలో ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్