రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ శివారున కారు మోటార్ బైక్ ను డీ కొన్న ప్రమాదంలో సి. ఆర్. పి. ఎఫ్ కానిస్టేబుల్ బొట్టా మోహన్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని రంపచోడవరం డిఎస్పీ ఆశ్రఫ్ ఆలీ శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును చూసారు. జడ్డంగి ఎస్. ఐ. చినబాబు, రాజ్ కుమార్, జయరాందొర, గోవిందరాజులు, శ్రీను పాల్గొన్నారు.